వందేమాతరం జాతీయ గీతం స్ఫూర్తితో అందరూ కలిసికట్టుగా భారత దేశ ప్రగతికి, అభివృద్ధికి పాటుపడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు, ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
వందేమాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ జాతీయ పతాకం ముంగిట జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ ఎం. నవీన్, సహాయ కలెక్టర్ పర్హీన్ జాహిద్ లతో కలిసి జాతీయ పతాకం చేతబూని వందేమాతరం గీతాలాపన చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ వందేమాతరం గీతం రచించి ఈరోజుకు 150 సంవత్సరాలు అయిందన్నారు. వందేమాతరం గీతం స్ఫూర్తినిచ్చే శక్తివంతమైన గీతమన్నారు. ఒకే సంస్కృతి ఒకే భాష మాట్లాడే వారిలో ఐక్యత పెంపొందాలనే ఉద్దేశంతో స్వాతంత్ర సమరయోధులు బంకించంద్ర చటర్జీ వందేమాతర గీతాన్ని రూపొందించారన్నారు. రాష్ట్ర ఆధారంగా గాని, భాష ఆధారంగా గాని లేదా ఏ ఇతర ఆధారంగా గాని ఎటువంటి విభేదాలు లేకుండా భరతమాత ముద్దుబిడ్డలుగా అందరము కలిసిమెలిసి భారతదేశ ప్రగతి, అభివృద్ధికి పాడుపడదామన్నారు
చరిత్రను ఒకసారి గుర్తు చేసుకుంటే 1905 సంవత్సరంలో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కర్జన్ బెంగాల్ రాష్ట్రాన్ని తూర్పు, పశ్చిమ బెంగాల్ గా విభజించారన్నారు. ఈ విభజనను వ్యతిరేకిస్తూ దేశంలో చాలా ఉద్యమాలు చేశారన్నారు. ఆ సమయంలో వందేమాతరం గీతం చాలా ప్రసిద్ధి చెందిందన్నారు. విడిపోయిన బెంగాల్ ని కలపడానికి వందేమాతర గీతం అందరికీ స్ఫూర్తినిచ్చిందన్నారు. వందేమాతర గీతం రాజకీయ విప్లవం, చరిత్రలో ఒక మలుపు తీసుకొచ్చిందన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కె చంద్రశేఖర రావు, డిఎస్ఓ మోహన్ బాబు డి టి డబ్ల్యూ ఓ ఫణి ధూర్జటి, సమాచార శాఖ డిడి వెంకటేశ్వర ప్రసాద్, వ్యవసాయ శాఖ ఏడి మణిధర్, కలెక్టరేట్ ఏవో రాధిక తదితర అధికారులు కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.





