శ్యామ్ కాగిత
ఎడిటర్
కార్తీక పౌర్ణమి బుధవారం, నవంబర్ 05, 2025న ఎస్ ఎస్ న్యూస్ తెలుగు వెబ్ సైట్ ను మొట్ట మొదటిసారిగా మచిలీపట్నం కేంద్రంగా ప్రారంభిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. వార్తలను పూర్తి పారదర్శకతతో నిక్ష్పక్షపాతంగా మీ ముందుంచేందుకు మా శాయశక్తులా ప్రయత్నిస్తాము. అతి తక్కువ సమయంలో వెబ్ సైట్ రూపొందించి మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న డిజిడయాస్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
వేమన శతకము
చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచమైన నదియు కొదవ కాదు
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ వినుర వేమ
మనసుపెట్టి చేస్తే ఏ చిన్న పనైనా సత్ఫలితాలను ఇస్తుంది. మనసు దాని మీద లేకపోతే అది ఫలించదు. మర్రి చెట్టు విత్తనము ఎంతో చిన్నది అయినా ఎంతో పెద్ద చెట్టయి విస్తరిస్తుంది. కాబట్టి ఏ పనైనా మనసారా చేయమని భావము.