పెరుగుతున్న రద్దీ దృష్ట్యా, ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించటానికి మచిలీపట్టణం తపాలా విభాగం లోని తొమ్మిది తపాలా కార్యాలయాలలో MPCM కౌంటర్ సమయాలని పెంచటం జరిగినది. ఇప్పటికే అన్ని ప్రధాన మరియు ఉప తపాలా కార్యాలయాలలో రోజుకి 6 గంటలు పనిచేస్తున్న MPCM కౌంటర్ సమయాన్ని మచిలీపట్టణం, చింతగుంటపాలెం, చిలకలపూడి, పెడన, గుడ్లవల్లేరు, పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డ, నాగాయలంక లోని ప్రధాన మరియు ఉప తపాలా కార్యాలయాలలో మరొక గంట పెంచటం జరిగినది.
వీటి ద్వారా ప్రజలు స్పీడ్ పోస్ట్, పార్సెల్ వంటి బుకింగ్ సేవల తో పాటు, తపాలా భీమా యోజన (PLI) మరియు గ్రామీణ తపాలా భీమా యోజన (RPLI) వంటి పథకాలకు భీమా చెల్లింపు మొదలగు సేవలకు ఎక్కువ సమయం లభిస్తుంది. కావున ప్రజలందరూ ఈ సేవలను వినియోగించుకోవాల్సినది గా మచిలీపట్టణం డివిజన్ పోస్ట్ ఆఫీసెస్ సూపరింటెండెంట్ బి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలియచేసారు.





