మన ఊరి వార్తలు మీ ముందుకు

Get in Touch

Email

Phone

+91- 9247033394
Blog Image
శ్యామ్ కాగిత, మచిలీపట్నం, 07 నవంబర్ 2025

జిల్లాలో బుక్ ఏ కాల్ విత్ బిఎల్ఓకు సంబంధించి ఇంకనూ అపరిష్కృతంగాఉన్న 82 ఓటర్ల అభ్యర్థనలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఎన్నికల అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాష్ట్ర వ్యాప్తంగా బుక్ ఎ కాల్ విత్ బిఎల్ఓ పేరిట ఓటర్ల సౌకర్యం కోసం ఈసీఐ నెట్ ద్వారా నూతన విధానంలో ఒక వేదికను ఏర్పాటు చేశారని కలెక్టర్ వివరించారు.

ఆ వేదికకు వచ్చిన అభ్యర్థనలను నిబంధనల ప్రకారం 48 గంటల్లో పరిష్కరించాల్సి ఉందన్నారు. దీనివలన ఓటర్ల అనుభవం పెద్ద ఎత్తున పెరుగుతుందన్నారు. అంతేకాకుండా ఎన్నికల ప్రక్రియలో సమర్థతను పటిష్ట పరుస్తుందన్నారు.

జిల్లాలో 7 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 99 అభ్యర్థనలు రాగా అందులో ఇప్పటివరకు 16 అభ్యర్థనలు పరిష్కరించడం జరిగిందన్నారు. మిగిలిన 83 అభ్యర్థనలలో ఒకటి అందుబాటులో లేకపోగా మిగిలిన 82 అభ్యర్థనలు అలాగే అపరిస్కృతంగా ఉన్నాయన్నారు. వాటిని సంబంధిత నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారులు(ఈ.ఆర్.ఓ లు), ఏ ఈ ఆర్ ఓ లు తక్షణమే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

బుక్ ఏ కాల్ విత్ బి ఎల్ ఓ అవకాశాన్ని ఓటర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.

Get in Touch

Latest News