
మచిలీపట్నం:
డిజిటల్ పాలనలో రాష్ట్రంలోనే కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మొదటి స్థానంలో నిలిచి అందరికీ ఆదర్శప్రాయులయ్యారని సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ కొనియాడారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ల పనితీరుపై ర్యాంకులు ప్రకటించారు. అందులో కృష్ణా జిల్లా కలెక్టర్ మొదటి స్థానంలో నిలిచారు. జిల్లా కలెక్టర్ 1,482 ఈ–కార్యాలయ దస్త్రాలు స్వీకరించగా అందులో 1,469 దస్త్రాలను వేగవంతంగా పరిష్కరించారు. సగటు స్పందన సమయం 14 గంటల 42 నిమిషాలుగా నమోదయింది. ఈ డిజిటల్ పాలనలో కృష్ణాజిల్లా అందరికీ ఆదర్శంగా నిలిచింది
ఈ నేపథ్యంలో సంయుక్త కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులందరూ జిల్లా కలెక్టర్ ను శాలువలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తన వద్దకు వచ్చిన ఏ దస్త్రము ఎక్కువ కాలం ఉంచుకోకుండా సత్వరమే పరిష్కరించడమే తన లక్ష్యమన్నారు.
దస్త్రాల పరిష్కారంలో సంయుక్త కలెక్టర్ కూడా 3 వ స్థానంలో నిలిచారని అభినందించారు.
జిల్లా అధికారులు కూడా వారి పరిధిలో దస్త్రాల పరిష్కారంలో ఏ మేరకు శ్రద్ధ కనబరుస్తున్నారో పరిశీలించి జిల్లాలో కూడా అధికారులకు ర్యాంకులు ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి,
డ్వామా , డి ఆర్ డి ఏ పి డి లు శివప్రసాద్, హరిహరనాథ్, జడ్పీ సీఈఓ కే. కన్నమ నాయుడు, రహదారులు భవనాల ఈఈ లోకేష్, డీఈవో సుబ్బారావు, డిఎస్ఓ మోహన్ బాబు, డిఎంహెచ్వో డాక్టర్ యుగంధర్, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి, జిల్లా ఉద్యాన అధికారి జె .జ్యోతి ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ సోమశేఖర్ తదితర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.