MachilipatnamLocal News
December 6, 2025
సమగ్రం

పామర్రు లో ప్రథమ చికిత్స కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా వైద్య శాఖ అధికారి డా పి.యుగంధర్

  • December 5, 2025
  • 0 min read
పామర్రు లో ప్రథమ చికిత్స కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా వైద్య శాఖ అధికారి డా పి.యుగంధర్

పామర్రు లో నిర్వహిస్తున్న ఆరు ప్రథమ చికిత్స కేంద్రాలను జిల్లా వైద్య శాఖ అధికారి డా పి.యుగంధర్ గారు వారి బృందం తనిఖీ చేసి ఆ కేంద్రాలలో ఐ. వి. సెట్లు, ఐ. పి .బెడ్లు మరియు హై పోటెన్సీ యాంటీబయటిక్స్ గమనించి ఈ మొత్తము ఆరు ప్రథమ చికిత్స కేంద్రాలను తక్షణము మూసి వేయ వలసినదిగా ఆదేశిస్తూ వారికి షోకాజు నోటీసులు ఇచ్చి మూడు రోజులలోగా సంజాయిషీ ఇవ్వవలసిందిగా ఆదేశించారు. 

 
     జిల్లాలో గల అందరు ఆర్ఎంపి వైద్యులకు 06, డిసెంబర్ 2025 న మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయము, మచిలీపట్నం నందు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వారు ప్రథమ చికిత్స కేంద్రాలలో చేయవలసిన, చేయకూడని పనుల నిమిత్తము ఒక అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లుగా జిల్లా వైద్య శాఖ అధికారి వారు తెలియజేశారు. కాబట్టి జిల్లాలో గల అందరూ ఆర్ఎంపి వైద్యులు 06, డిసెంబర్ 2025 న మధ్యాహ్నం మూడు గంటలకు జిల్లా వైద్య శాఖ అధికారి వారి కార్యాలయం మచిలీపట్నంకు హాజరు కావలసిందిగా ఆదేశించినారు.
About Author

ssnews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *