కృష్ణా యూనివర్సిటీ లో స్పాట్ అడ్మిషన్స్
కృష్ణా విశ్వవిద్యాలయం:కృష్ణా విశ్వవిద్యాలయం లో పిజి కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్ధుల కోసం ఈ నెల 8 వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డా. ఎల్ సుశీల తెలిపారు. పిజి కోర్సుల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్షకు హాజరు కానీ వారు, అర్హత సాధించని వారు కూడా అర్హులేనని తెలిపారు. కృష్ణా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో తమ సర్టిఫికెట్లతో 8 వ తేదీన అభ్యర్ధులు స్వయంగా రిపోర్ట్ చేయవచ్చని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

