పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి డివిజనల్ అభివృద్ధి అధికారుల కార్యాలయాలు ఎంతగానో తోడ్పడతాయని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు.
గురువారం ఉదయం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలో నూతనంగా నిర్మించిన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయంతో పాటు రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన మొత్తం 77 డిడిఓ కార్యాలయాలయ భవనాలను లాంచనంగా వర్చువల్ గా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ మచిలీపట్నం మండలంలోని పోతేపల్లి గ్రామ సచివాలయ పై భాగంలో నూతనంగా నిర్మించిన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్, రాష్ట్ర ఎంజిఎన్ఆర్ఇజిఎస్ అదనపు కమిషనర్ శివప్రసాద్ లతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు డి డి ఓ, డిఎల్పిఓ, ఏపీఓ, సిబ్బంది గదులను పరిశీలించారు.
తదనంతరం జిల్లా కలెక్టర్ శాసనసభ్యులు డి డి ఓ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు, వారికి సంబంధించిన వివిధ రకాల పనుల కోసం జిల్లా కేంద్రానికి రాకుండా డివిజనల్ స్థాయిలో ఏర్పాటుచేసిన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాల వద్దకు రావాలన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా అమలుపరుస్తున్న పలు రకాల సంక్షేమ అభివృద్ధి పథకాలపై డివిజనల్ స్థాయిలో డివిజనల్ అభివృద్ధి అధికారులు సజావుగా పర్యవేక్షించాలన్నారు.
వారికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి డివిజనల్ అభివృద్ధి కార్యాలయ భవనాలను నూతనంగా నిర్మించడం ప్రజలకు ఎంతగానో సౌకర్యవంతంగా ఉందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
డివిజన్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించుటకు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలన్నారు.
గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలకు సంబంధించి అన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల పై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించాల్సి ఉంటుందన్నారు.
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యం శాఖల వారితో తరచూ సమీక్షలు నిర్వహించి ప్రజలకు కావలసిన కనీస అవసరాలను అందించుటకు కృషి చేయాల్సి ఉంటుందన్నారు.
పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడం సంతోషదాయకమన్నారు. ప్రజలకు అందుబాటులో డివిజనల్ అధికారుల కార్యాలయాలు ఏర్పాటు కావడం శుభ పరిణామం అన్నారు.
డివిజనల్ స్థాయిలో ప్రభుత్వం చేపట్టిన వివిధ రకాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా అమలు అయ్యేందుకు ఒకే చోట డివిజనల్ అధికారుల కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో మార్గం సుగమయిందన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆక్వా కల్చర్ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ లంకె నారాయణ ప్రసాద్, డిసి ఎం ఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, జిల్లా పరిషత్ సిఇఓ కె.కన్నమనాయుడు, డ్వామా పీడీ శివప్రసాద్, డి ఎల్ డి ఓ జి పద్మ, డి ఎల్ పి ఓ రజావుల్లా, ఎంపీడీవో వెంకటేష్ ,తహసిల్దారు నాగభూషణం, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, రాష్ట్ర మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె నాని, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, మాజీ సర్పంచ్ కాటం మధుసూదన్
హెచ్డిఎస్ మాజీ చైర్మన్ సోమశేఖర్, స్థానిక నాయకులు శ్రీపతి చంద్రబాబు, కమ్మిలి మధుసూదన్, బండి శివ, ఎంపీడీవోలు డిప్యూటీ ఎంపీడీవోలు తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.

