MachilipatnamLocal News
December 6, 2025
సమగ్రం

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయం: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

  • December 5, 2025
  • 0 min read
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయం: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. 
 
శుక్రవారం జిల్లా కలెక్టర్ మండల కేంద్రమైన నాగాయలంకలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. అక్కడ జరుగుతున్న మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి విచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులతో జిల్లా కలెక్టర్ ముఖాముఖి మాట్లాడారు. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. వారి పిల్లలకు ఉపాధ్యాయులు ఏ విధంగా చదువు చెబుతున్నారుఅని అడిగి తెలుసుకున్నారు. భోజనం ఎలాగా ఉందని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి మధ్యాహ్నం భోజనం రుచి చూశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భోజనం బాగుందంటూ జిల్లా కలెక్టర్ కు తెలిపారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, చదువు బాగా చెబుతున్నారని, విజ్ఞాన యాత్రలు కూడా నిర్వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్కు వివరించారు. 
 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో మెగా పేరెంట్స్ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ఈ సమావేశం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలు ఏ స్థాయిలో చదువుకుంటున్నారో తెలుసుకోగలుగు తున్నారన్నారు. 
       
ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యాపారవేత్తలను తయారు చేయాలని సంకల్పించిందన్నారు. జిల్లాలో 300 మంది స్ఫూర్తి ఉన్న వ్యాపారవేత్తలను గుర్తించామన్నారు. అందులో ఇప్పటికే 90 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక సహాయం అందించామన్నారు. 
       
అవనిగడ్డ నాగాయలంక మండలాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రభుత్వ సహాయంతో ఏర్పాటు చేసుకున్న డ్వాక్రా యూనిట్లను పరిశీలించామని వారు వ్యాపారాన్ని బాగా విస్తరించుకున్నారన్నారు. ఎక్కువమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారన్నారు.
 
విజన్ ఆంధ్ర 2047 లో భాగంగా పెరటి తోటల పెంపకానికి కూడా ప్రోత్సాహాలను అందిస్తున్నామని, రసాయన ఎరువులు లేకుండా ఆకుకూరలు కూరగాయలు పండిస్తున్న తోటలను కూడా పరిశీలించామన్నారు.
 
అనంతరం జిల్లా కలెక్టర్ పాఠశాలలోని ఫుట్బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్ తదితర క్రీడా సామాగ్రిని, శరీర భాగాలను వివరించే ప్రయోగశాల పరికరాలను, మైక్రోస్కోప్ ను, వ్యర్థాలతో కళాకృతులను పరిశీలించారు. 
 
చాలామంది విద్యార్థులకు భవిష్యత్తులో కేవలం డాక్టర్ ఇంజనీరు లేదా ఉపాధ్యాయుడు కావాలని అనుకుంటుంటారని అలా కాకుండా ఇతరత్రా రంగాలలో కూడా రాణించవచ్చని విశదీకరిస్తూ విద్యార్థులకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ వృత్తి విద్య శిక్షకులు సాయి కుమార్, తులసిలకు సూచించారు.
 
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట మత్స్యకారుల సొసైటీ చైర్మన్ చిలకలపూడి పాపారావు, తహసిల్దారు ఆంజనేయ ప్రసాదు, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ లీలా మారుతి, ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ తలసిల స్వర్ణలత, తదితరులు పాల్గొన్నారు. 
About Author

ssnews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *